
జలదంకి, నవంబర్ 28, మన ధ్యాస ప్రతినిధి (కె ఎన్ రాజు)://
జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో జరిగిన గొట్టిపాటి ప్రసాద్ నాయుడు అంత్యక్రియలకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై,పుష్పమాల సమర్పించి గౌరవప్రదంగా శ్రద్ధాంజలి ఘటించారు.ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన పట్ల లోతైన విచారాన్ని వ్యక్తం చేస్తూ,ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని,ప్రార్థించారు.అనంతరం, ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సుమారు అరగంట పాటు మాట్లాడి,ఈ కష్టసమయంలో ధైర్యం నింపుతూ వారి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక భారాన్ని అర్థం చేసుకుని,ఎల్లవేళలా తమ అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ దారుణ హత్యకు కారణమైన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడి న్యాయం సాధికారికం అవుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానికులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై గొట్టిపాటి ప్రసాద్ నాయుడు కి కడసారి వీడ్కోలు పలికారు
