
వింజమూరు, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి, (కె ఎన్ రాజు)://

వింజమూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మాణం పూర్తిచేసుకున్న అన్నా క్యాంటీన్ భవనాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి,స్వయంగా సందర్శించి,పరిశీలించారు.నిర్మాణ,పనులు,వసతులు,ప్రజలకు అందించాల్సిన సేవలపై సమగ్రంగా అవగాహన తీసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి నియోజక వర్గములో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పం చేశారు. ఇందులో భాగంగా వింజమూరు ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరలో అందించేందుకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని తెలిపారు.అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నామని, అత్యంత త్వరలో క్యాంటీన్‌ను ప్రజల సేవకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాల ద్వారా పేదల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఎమ్మెల్యే కాకర్ల పేర్కొన్నారు