మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలం వీరాపురం క్రాస్ రోడ్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడడంతో ఆళ్లపల్లి మండలం నడిగూడెం గ్రామానికి చెందిన పాయం రవితేజకు తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన పాయం రవితేజను మెరుగైన వైద్యం కొరకు కరకగూడెం ఎస్సై రాజేందర్ 108 వాహనంలో మణుగూరుకు తరలించారు.