
*ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో చంద్రారెడ్డి పాలెం నందు ఎన్నికల సమయంలో రోడ్డులు వేయిస్తాను అని హామీఇచ్చిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇచ్చిన హామీని నిరవేర్చిన వైనం*


కలిగిరి నవంబర్ 27 మన ధ్యాస ప్రతినిధి ://
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎన్నికల సమయంలో కృష్ణారెడ్డిపాళెం పంచాయతీ లోని చంద్రారెడ్డిపాళెం గ్రామంలో తిరిగిన ఆయనకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, దర్శనమిచ్చాయి.చలించిపోయిన ఆయన టిడిపి అధికారంలోకి రాగానే రోడ్డు రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చంద్రారెడ్డిపాళెం గ్రామంలోని రోడ్డు ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం పట్లా గ్రామం లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు,కుడుములదిన్నెపాడు సొసైటీ డైరెక్టర్ డబ్బు గుంట మాలకొండయ్య (బుజ్జయ్య), 234వా బూతు కన్వీనర్ డబ్బుగుంట మధుబాబు,టిడిపి నాయకులు కుమ్మరి కిష్టారావు, వెంకట్రావు,వంగవరుగు రమణారెడ్డి, ఒంటేరు ప్రసాద్, హజరత్తయ్య, మాలకొండ రెడ్డి, చిన్న మాలకొండయ్య, శ్రీహరి రెడ్డి, కొండయ్య టిడిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
