
జలదంకి నవంబర్ 26 మన ధ్యాస న్యూస్
జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం చెందిన టిడిపి నాయకులు గొట్టుపాటి ప్రసాద్ ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసిన హత్య చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వెంకటరామారావు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలను లోతుగా దర్యాప్తు చేసి నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టిపాటి ప్రసాద్ తనకు ఎంతో సన్నిహిత వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగడ సానుభూతి తెలిపారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు