
మన ధ్యాస, మనుబోలు, నవంబర్ 26:మంత్రిగా రెండో సారి సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని రాష్ట్ర ఆరోగ్యం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మనుబోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.......పొదలకూరు ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న డయాలసిస్ సెంటర్ కేటాయించే వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒప్పుకోలేదు అని అన్నారు.ఏదేని ఒక పనిచేపడితే అది కార్యరూపం దాల్చేంత వరకు సోమిరెడ్డి నిద్రపోరు అని అన్నారు.ప్రభుత్వం 5 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే, అక్కడితో ఊరుకోకుండా సీఎస్ఆర్ నిధులతో మరో 3 బెడ్లు అందుబాటులోకి తెచ్చారు అని అన్నారు.ప్రజల కోసం ఎలా పనిచేయాలనేందుకు పెద్దాయన వెంకయ్యనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకులు ఆదర్శప్రాయులు అని అన్నారు.ప్రభుత్వ నిధులు సాధించుకోవడంతో పాటు తన అనుభవాన్ని ఉపయోగించుకుని సీఎస్ఆర్ నిధులు కూడా తెచ్చుకుంటున్నారు అని అన్నారు.నేను మొదటిపర్యటన సందర్భంగా అల్లీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఎంపీ బీద మస్తాన్ రావు నిధుల నుంచి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేయించుకున్నారు అని అన్నారు.ఈ రోజు కూడా నన్ను పట్టుపట్టి మనుబోలుకు తీసుకొచ్చారు అని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాయి అని అన్నారు.ప్రజారోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు అని అన్నారు.ప్రజలకు అంకితభావంతో వైద్యసేవలు అందిస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని అన్నారు.వైసీపీ ప్రభుత్వంలో పదేపదే జీఓలు జారీ చేయడం తప్ప పనులు ముందుకు జరగలేదు...పనులు చేస్తే బిల్లులు వస్తాయనే భరోసా కూడా కాంట్రాక్టర్లకు లేదు అని అన్నారు.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (విలేజ్ హెల్త్ క్లినిక్) లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైసీపీ సర్కారు వాటిని దారిమళ్లించింది అని అన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యానికి అడుగడుగునా తూట్లు పొడిచింది అని అన్నారు.భూసేకరణ జరగకుండా, నిధులు మంజూరు చేయకుండానే జీఓలు జారీ చేసేశారు అని అన్నారు.ప్యాలెస్ లో కూర్చుని బటన్లు నొక్కుతూ ప్రజలను మభ్య పెట్టే మాటలకే అప్పటి సీఎం పరిమితమయ్యారు అని అన్నారు.నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి..ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించిన పెద్దమనుషులు ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టలేదు అని అన్నారు.కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉండవు...ప్రతి ఒక్కరూ ప్రజల కోసమే పనిచేస్తారు అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని 35 విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణానికి రూ. 13.75 కోట్లు మంజూరు చేశాం అని అన్నారు.ముత్తుకూరులో రూ.1.95 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టాం అని అన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.అనంతరం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.........పిలవగానే పలికే సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండటం మనకు అదృష్టం అని అన్నారు.సత్యకుమార్ యాదవ్ తో మాకు అనేక ఏళ్ల అనుబంధం ఉంది అని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే నేను కోరిన వెంటనే పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించారు అని అన్నారు.ఐదు మండలాల ప్రజలు డయాలసిస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు అని అన్నారు.మనుబోలులో ఈ రోజు ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2020లోమంజూరైంది అని అన్నారు.నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు అని అన్నారు.వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు ఉన్నప్పటికీ బిల్లుల మంజూరుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని అన్నారు.మా సూచనల మేరకు భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అప్పగించిన కాంట్రాక్టర్ కు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు.రూ.1.93 కోట్లతో ఎస్ ఈ ఐ ఎల్ కంపెనీ సర్వేపల్లి నియోజకవర్గంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన పరికరాలు అందిస్తోంది అని అన్నారు.కొన్ని పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి రాగా మరికొన్ని రావల్సివుంది అని అన్నారు.ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 1.87 ఎకరాల భూమిలో రూ.20 కోట్లతో ఆస్పత్రి నిర్మించేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చింది అని అన్నారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ముత్తుకూరు ప్రాంతంలో వేలాదిగా కార్మికులు వస్తున్నారు అని అన్నారు.అలాంటి ప్రాంతంలో ఆస్పత్రి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. వైద్యపరీక్షలతో పాటు సేవలు కూడా ఉచితంగా అందనున్నాయి అని అన్నారు.



