
హత్య చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
గొట్టిపాటి ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
జలదంకి నవంబర్ 26 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి://

ఉదయగిరి నియోజకవర్గం లోని జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ చింతలపాలెం గ్రామానికి చెందిన గొట్టిపాటి ప్రసాద్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా బుధవారం హత్య చేశారు.స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గొట్టిపాటి ప్రసాద్ హత్య హేయమైన చర్య అని దీని వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు,హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు