
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన ఏలే మల్లికార్జున్ను మంత్రి దామోదర రాజనర్సింహా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా పార్టీ బలోపేతం,కార్యకర్తల సమన్వయం,అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై దృష్టి పెట్టాలని సూచించారు.