
మన ద్యాస, నిజాంసాగర్, (జుక్కల్) : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్వగృహంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు సీఎం కు తాజా రాజకీయ పరిణామాలు,జిల్లా స్థాయిలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యల గురించి వివరించారు.సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
సమీపంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను స్పష్టంగా వివరించాలి అని సూచించారు.ప్రతి గ్రామంలో ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను వినుతూ, ప్రభుత్వం చేపడుతున్న పనులను ఇంటింటికీ చేర్చాలని కార్యకర్తలకు సూచించారు.అలాగే,గ్రామ, మండల,జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్ఠం చేయడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వ కొలమానాన్ని ప్రజల్లో బలంగా నిలిపే బాధ్యత కార్యకర్తలదే అని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల లోపల ఉన్న సవాళ్లను ఏకతాటిపై ఎదుర్కొనేలా అన్ని వర్గాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని సీఎం పేర్కొన్నారు.డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ…జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి, కార్యక్రమాల అమలుకు మరింత శ్రమించాలని సూచించారు.ప్రజల అండతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం
.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వైస్ చైర్మన్ & అధ్యక్షులు ఫహీమ్ ఖురేషి మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున్ ను ఫహీమ్ ఖురేషి శుభాకాంక్షలు తెలిపారు.
