
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు,బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించే పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా బస్సు రవాణాలో ఉచిత ప్రయాణం,గృహ లక్ష్మీ పథకంలో ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఇళ్ల నిర్మాణ సహాయం,రైతులకు రైతు భరోసా,మహిళా సంఘాలకు సబ్సిడీ రుణాలు, అలాగే పేద కుటుంబాలకు చికిత్స కోసం ఆరోగ్య సహాయం వంటి పథకాలు ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు.ప్రతి లబ్ధిదారునికి పథక ప్రయోజనాలు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీ శ్రీకాంత్,వివో ఏ నాయకులు చాకలి మొగులయ్య,ఇతరులు పాల్గొన్నారు.