Mana News;- తిరుపతి మంగళం రోడ్డులో ఉన్నటువంటి శ్రీనివాస హై స్కూల్ ని సందర్శించిన డాక్టర్ షీలా లోకనాథన్ ( స్టేట్ వైస్ చైర్మన్ ఉమెన్ ఎంపవర్మెంట్ వింగ్ యాంటీ కరప్షన్ & విజిలెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) .ఈ సందర్భంగా అక్కడున్నటువంటి 6 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థినులో, స్ఫూర్తిని నింపి చైతన్య పరచడానికి వాళ్లలో మమేకమై , ముచ్చటించి కొంత సమయం గడిపారు. నైతిక విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానం , స్వేచ్ఛ మరియు మహిళా సాధికారిక గురించి వాళ్లకి వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో ఎవరి వల్లనైనా, ఆడపిల్లలు ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ధైర్యంగా ముందుకు వచ్చి తమ తల్లిదండ్రులకు, గురువులకు ,సన్నిహితులకు తెలియచేసి వెంటనే సమస్యను పరిష్కరిష్కరించుకోగలిగినట్లయితే భవిష్యత్తులో జరగబోయే అనర్ధాలు నివారించవచ్చని తెలియజేశారు. ఓర్పు సహనంతో పాటు, మంచేదో చెడేదో గ్రహించి, ఎవరు ఎలాంటి వాళ్ళు అని గమనిస్తూ గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి తెలియజేస్తూ వాళ్లలో స్ఫూర్తిని నింపారు. పిల్లలందరూ చాలా చక్కగా స్పందించారని ,అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని ఇలా పిల్లలతో సమయం గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు.అలాగే తల్లితండ్రులు , పెద్దలు వాళ్లతో అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ కొంత సమయం కేటాయించి వాళ్లలో మనోధైర్యాన్ని స్ఫూర్తిని నింపాలని కోరుకున్నారు.