
రైతన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు.చంద్రపడియ గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాతలకు అందుతున్న పథకాలను గురించి వివరణ.అన్నదాత సుఖీభవ అందడంతో రైతన్నల హర్షం.
వింజమూరు నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి://

రైతన్న సేవలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవీణ దంపతులు తరించారు. సోమవారం వింజమూరు మండల పరిధిలోని చంద్ర పడి య గ్రామంలో రైతన్న సేవలో.. మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా, మాతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ అందిన రైతులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొని ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి రైతు ఖాతాలో 14 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు విడతల ద్వారా 4000 అందించగా రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలను అందించిందని తెలిపారు. మరో విడతలో 6000 రూపాయలు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. సబ్సిడీ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్, వ్యవసాయ పనిముట్లను అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న 12 సొసైటీల ద్వారా రైతులకు 270 రూపాయలకే యూరియా బస్తా అందిస్తున్నారన్నారు. ఎక్కడ యూరియా కొరత లేదని ఇది వైసీపీ నాయకుల సృష్టి అని తెలిపారు. వారి పత్రిక ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న 149 చెరువుల్లో తుఫాన్ ప్రభావంతో నీరు చేరిందని, రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుంది అని తెలిపారు. అదే గ్రామం నుండి వెళుతున్న ఆర్టీసీ బస్సు లోనికి ఎమ్మెల్యే ప్రవేశించి మహిళలతో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. చంద్రన్న ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని, ఆర్టీసీ బస్సు ప్రయాణం సులభతరంగా ఉందని, ఆనందం వ్యక్తపరిచారు. మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు కి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రైతులకు సొసైటీ ద్వారా యూరియాని అందజేశారు.
అంతకుముందు గ్రామస్తులు, రైతులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులకు ఘన స్వాగతం పలికి శాలువాలు పూలమాలలతో సత్కరించారు. భారీ ఎత్తున బాణా సంచాలు కాల్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్,క్లస్టర్ ఇంచార్జ్, చేబ్రోలు వసంతరావు, కో క్లస్టర్ ఇంచార్జ్ మాలేపాటి మాల్యాద్రి, ఉప సర్పంచ్ కాటం రమణారెడ్డి, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, వెంగప నాయుడు,చెరువు అధ్యక్షులు వేమూరి దొరస్వామి నాయుడు, వెంకటనారాయణ, బి అంకయ్య, చిన్నబయ్య, తమి దల విజయ్, సర్పంచ్ దాట్ల రమణారెడ్డి, మాజీ సర్పంచ్ దాట్ల కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు కోడూరు నాగిరెడ్డి, గని శ్రీనివాసులు, దుద్దుగుంట శ్రీనివాసులురెడ్డి, గంగపట్ల హాజరత్, బో రెడ్డి హాజరత్ రెడ్డి, వేమూరి లక్ష్మీనారాయణ, అధికారులు, ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి,ఏడి శేషగిరి, ఏవో వాసు, హెచ్ ఓ షకీల్, ఆర్ ఐ, ఇమ్రాన్ ఖాన్, వీఆర్వో, మేరవలి,పంచాయతీ కార్యదర్శులు, రామారావు, జయలక్ష్మి, సచివాలయం సిబ్బంది. తదితరులు ఉన్నారు.
