తవణంపల్లి డిసెంబర్ 7 మన న్యూస్
తల్లిదండ్రుల స్ఫూర్తితో పదవ తరగతి విద్యార్థులకు టెస్ట్ పేపర్లు బహుకరించిన ప్రశాంత్ కుమార్. అరగొండ గ్రామపంచాయతీ నందు బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల మరియు కళాశాల, పైమాగం పాఠశాల లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు అతిథులుగా హాజరైన ప్రశాంత్ కుమార్ వాళ్ల తల్లిదండ్రులు అరగొండ హై స్కూల్ పూర్వ విద్యార్థి టి.కుమార్ మరియు సతీమణి ఎం.మణిమాల చదువుకున్నట్టుకు ప్రోత్సహించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు మరియు విద్యార్థుల గురించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్,అరగొండ సర్పంచ్ టి.మల్లు దొరై,పంచాయతీ కార్యదర్శి మురుగేషన్,వార్డు మెంబర్లు ఉమామహేశ్వరి,వాణి,నాగరాజ్,రంజిత్ రెడ్డి,పి సి బాబు,శివ, పూర్వ విద్యార్థిని సి భావన, తంగరాజ్, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.