మన న్యూస్: ఎల్బీనగర్, ప్రముఖ పురుషుల బ్రాండ్ అయిన స్నిచ్ హైదరాబాద్ నగరంలో తమ మూడవ బ్రాంచ్ ను ఎల్బీనగర్ని యోజకవర్గంలోని కొత్తపేట నుండి ఎల్బీనగర్ వెళ్లే రహదారిలో వైట్ హౌస్ షాపింగ్ మాల్ కి ఎదురుగా స్నిచ్ షాపింగ్ మాల్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా స్నిచ్ డైరెక్టర్ రోహిత్ ఝామనానీ హాజరై ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బీనగర్ పరిసర ప్రాంతంలో తమ స్టోర్ ను ప్రారంభించడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు.తమ కస్టమర్లు ఎల్లప్పుడూ అత్యంత స్టైలిష్ దుస్తులు ఎంపికలను కలిగి ఉంటారని, నేటి యువత అభిరుచులకు అనుగుణంగా గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్లను తమ కస్టమర్లకు అందించడమే తమ ధ్యేయంగా పేర్కొన్నారు.ఓపెనింగ్ సందర్భంగా రెండు రోజులు తాము 20% డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవంలో క్లస్టర్ మేనేజర్స్ అంజన్ కుమార్,రూపేష్ కుమార్,స్టోర్ మేనేజర్ శ్యామ్ పాల్గొన్నారు.