
మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, నవంబర్ 22 :నెల్లూరు జిల్లా,బుచ్చిరెడ్డిపాలెం లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం ఇంద్రప్రస్థ లేఔట్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి తేజో డెవలపర్స్ సహకారంతో తెలుగుదేశం నాయకులు చింతం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రప్రస్థ లేఔట్ లో 100 కేజీల భారీ కేక్ కటింగ్ చేశారు. వెయ్యి మందికి దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తేజో డెవలపర్స్ అధినేత శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...... కోవూరు శాసనసభ్యు రాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మా ఇంద్రప్రస్థ లేఔట్ లో జన్మదిన వేడుకలు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను అని తెలియజేశారు.బుచ్చి రెడ్డిపాలెం మండల తెలుగుదేశం నాయకులు చింతం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ........ కోవూరు నియోజవర్గానికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే కావడం మా అదృష్టం అని అన్నారు. ఆమె పాలనలో ప్రజలు కార్యకర్తలు, సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుచ్చి రూరల్ బ్యాంక్ చైర్మన్ ఏటూరు శివరామకృష్ణారెడ్డి ,బుచ్చి టిడిపి నగర అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు , సీనియర్ నాయకులు ఎమ్ వి శేషయ్య, దుగ్గిశెట్టి హరినాథ్ ,శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి తేజో డెవలపర్స్ శ్రీనివాసరెడ్డి , చింతం శ్రీనివాస్ రెడ్డి కాలువలు కప్పి సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులకు విచ్చేసిన వారు మాట్లాడుతూ.... తేజో డెవలపర్స్ అదినేత శ్రీనివాసులు రెడ్డి మరియు చింతం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు వారిని అభినందించినారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ప్రశాంతి రెడ్డి మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుచున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



