
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం కాలేజీ గ్రౌండ్లో ఉన్న వీర హనుమాన్ వ్యాయామ కళాశాల 2007 లో అప్పటి గ్రామ యువత, పెద్దల ఆధ్వర్యంలో కొంతమంది కమిటీగా ఏర్పడి వ్యాయామ కళాశాల ప్రారంభించడం జరిగింది. అప్పటినుండి వందలాదిమంది యువత వ్యాయామంలో శిక్షణ పొందారు. అయితే కళాశాల బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడిన యువత శిడగం రాజేశ్వరరావు, ఎస్.కె అలీషా, శ్రీనివాస్, ఎస్పీ రాజు, దొరబాబు, ఫణి, విజయ్ కుమార్, సతీష్, శివరామకృష్ణ, సత్తిబాబు, బాలు బాలు బన్నీ, బన్నీ, పలువురి దాతల సహాయంతో మరమ్మతులు చేయించి సరికొత్త వ్యాయామ సామాగ్రిని ఏర్పాటు చేశారు. దీనికి విరాళాల ఇచ్చిన వారి వివరాలను వ్యాయామ కళాశాలలో ఆవిష్కరించారు ఈ పున ఈ పునప్రారంభ కార్యక్రమానికి గ్రామంలోని పలువురు పెద్దలను ఆహ్వానించగా మున్సిపల్ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు,రాయుడు చిన్న, యువ నాయకులు శిడగం రాజేశ్వరరావు, కర్రోతు గాంధీ, కిలారి రామచంద్రరావు, కోరాడ రాజు, బూర్ల సూరిబాబు, గోనాపు అప్పలరాజు, కె సత్తిబాబు, శిడగం మాధవ, ఎండి అధికార్, జిమ్ నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.