
యాదమరి నవంబర్ 19 మన ద్యాస
యాదమరిలో పంచాయతీ రాజ్ విభాగం ఆద్వర్యంలో నిర్వహించిన రచ్చబండ విజయవంతం యాదమరి: వైద్య విద్యను అభ్యసించి పేదలకు నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్న పేద విద్యార్థుల చిరకాల వాంఛను చిదిమేస్తూ వారిని నట్టేట మించేసావు కదా బాబూ..అని పూతలపట్టు వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో పంచాయతీరాజ్ విభాగం ఆద్వర్యంలో జిల్లా అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు మనోహర్ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఏ మాట్లాడుతూ...నిరంతరం పేదల సంక్షేమంపై పరితపించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెరుగైన వైద్య సేవలతో పాటు, పేద విద్యార్థుల వైద్య విద్యను అభ్యసించాలన్న మనోవాంచను నెరవేర్చడానికి నడుం బిగించారు.అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకు వచ్చారు.కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో 17 మెడికల్ కాలేజీలను పూర్తిగా నిర్వీర్యం చేయుటకు కుట్ర పన్నుతోందని అన్నారు.మూడు దఫాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయిన తీసుకురావాలన్న ఆలోచనే చేయలేదన్నారు.అటువంటిది యువకుడైన మన నాయకుడు జగన్ కేంద్రపెద్దలను ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి ఒక మహా యజ్ఞాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని పూర్తిచేసారన్నారు.అనంతరం జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ..ప్రజా నేత్, సంక్షేమ పథకాల సృష్టికర్త అయిన వైఎస్ జగన్.. ప్రపంచాన్ని వనికించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన మహమ్మారి కరోనా సమయంలో కూడా పేదలకు మెరుగైన వైద్యం అందించి ప్రాణ నష్టాన్ని తగ్గించారని చెప్పారు.రాష్ట్రం ఆర్థికంగా అధ పాతాళంలో ఉన్నా..పేద విద్యార్థులు అభ్యున్నతికి శ్రమించారని చెప్పారు.కానీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు.లక్షల కోట్లు వెచ్చించి అమరావతిని నిర్మిస్తున్నారని..కానీ కేవలం రూ.5 వేల కోట్ల వెచ్చించి అసంపూర్తిగా ఉన్న నాలుగు మెడికల్ కాలేజీలను ఎందుకు పూర్తి చేయలేరని సూటిగా ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై తీసుకున్న ప్రజా ఆమోదయోగ్యం కానీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించి గద్దె దింపుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి,మాజీ ఎంఎల్ఏ లలితా థామస్,రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శుల అమర్నాథ్ రెడ్డి,నాగశంకర్ రెడ్డి, యాదమరి, ఐరాల మరియు నగరి మండలాల పంచాయతీ రాజ్ అధ్యక్షులు రమేష్,ఓబుల్ రెడ్డి,గోవర్ధన్ నాయుడు, నియోజకవర్గంలోని వివిధ మండలాల కన్వీనర్లు,సీనియర్ నాయకులు, సర్పంచులు,ఎంపీటీసీ లు, మహిళా విభాగం సభ్యులు,యువత అధ్యక్షులు,కార్యకర్తలు,అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.నియోజకవర్గ కార్యక్రమం విజయవంతం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.