
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) భారత తొలి మహిళా ప్రధాని, భారతరత్న,దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానేత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ—ఇందిరా గాంధీ భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన శక్తిమంతమైన నాయకురాలు అని కొనియాడారు.రాజకీయ జీవనంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ,ఆమె చూపిన పట్టుదల, ధైర్యసాహసాలు దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజా పండరి,అనీస్,రమేష్,రాము రాథోడ్, ఆజరోద్దీన్,తదితరులు ఉన్నారు.