
మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి రమా దేవితో పాటు కాపు కమ్యూనిటీలో నామినేటెడ్ పదవులు పొందిన పలువురు కాపులను సత్కరిస్తూ వేడుకగా జరిగింది.ఈ కార్యక్రమం లో వేలాదిగా బలిజలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రుద్ర హోమం శివలింగ అభిషేకంలో పాల్గొన్నారు.గతంలో పొంగూరు నారాయణ అధికారంలో మూడు ఎకరాల 20 సెంట్లు ప్రభుత్వ భూమిని బలిజ భవన్ కి కేటాయించి,కోటి రూపాయల సొంత నిధుల నుంచి ఫండ్ ఇచ్చిన సంగతి విజేతమే.దానికి అదనంగా ఈరోజు సొంత నిధుల నుంచి కోటి రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించి బలిజ భవన్ అభివృద్ధి చేసి పేదల వివాహాది శుభకార్యాలకు జరుపుకునే విధంగా ఒక కమిటీని రూపొందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం కాప్రాక్స్ నెల్లూరు జిల్లా అడ్మిన్ పసుపర్తి కిషోర్, బావిశెట్టి కిషోర్,గునుకుల కిషోర్,నాగళ్ళ కృష్ణ,పవన్ కుమార్,రమేష్,జగదీష్,పవన్ కుమార్,కోటేశ్వర్రావు,పీఠాదిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి,మరియు బలిజ బంధువులతో వైభవంగా సాగింది.







