
మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు లలితా రామ్ , సమాధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పడారిపల్లి గంగమ్మ దేవస్థానం వద్ద కార్తిక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ భూదాటి రాధయ్య మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ, జనసేన జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్ , వైసిపి నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ , పి.ఎల్ రావు, యనమల నాగేశ్వరావు యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... బీసీ సంఘీయులందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి కార్తీక వనభోజనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. బీసీలందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు నక్క దినేష్ యాదవ్, పవన్ కుమార్ యాదవ్, దువ్వూరు అరుణమ్మ, ముత్యం గౌడ్, కందుకూరి శ్రీ కుమార్, రావులపల్లి వెంకట జ్యోతి, శ్రీహరి, సోమాగోపాల్, రామ్మో హన్, ఉడతా మురళి, లక్ష్మీ యాదవ్, లక్ష్మి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



