
మన ధ్యాస ,విజయవాడ, నవంబర్ 14: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆభరణాల రిటైలర్ , భారతదేశంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో అగ్రగామి సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, దాని ప్రతిష్టాత్మక ' హంగర్ ఫ్రీ వరల్డ్' కార్యక్రమాన్ని ఇథియోపియాకు విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంతో పాటు జాంబియాలో దాని పరివర్తన విజయం అందించిన విజయపు స్పూర్తితో , ఈ కార్యక్రమం ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో దాని తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశించింది. భారతదేశం యొక్క కరుణ మరియు సామూహిక పురోగతి యొక్క అనే తత్వంలో పాతుకుపోయిన ' హంగర్ ఫ్రీ వరల్డ్' నమూనా, ఒక భారతీయ సంస్థ స్థానికంగా సాధించిన విజయం నుండి ప్రపంచ ప్రభావాన్ని ఎలా తీర్చిదిద్దగలదో సూచిస్తుంది. దాని నికర లాభాలలో 5% స్థిరంగా పెట్టుబడి పెట్టడం ద్వారా - భారతదేశంలో తప్పనిసరి సీఎస్ఆర్ కేటాయింపు 2% కంటే రెట్టింపు కన్నా ఎక్కువ - కార్పొరేట్ సామాజిక బాధ్యత యొక్క స్థాయి మరియు నిజాయితీని పునర్నిర్వచించడంను మలబార్ కొనసాగిస్తోంది, దాని నిరూపితమైన భారతదేశం ఆధారిత కార్యాచరణను ఆకలి , విద్యా అసమానతలకు వ్యతిరేకంగా ప్రపంచ ఉద్యమంగా అనువదిస్తుంది.దుబాయ్ గోల్డ్ సౌక్‌లోని మలబార్ ఇంటర్నేషనల్ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అక్కడ మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కె.పి, దుబాయ్‌లోని ఇథియోపియా కాన్సుల్ జనరల్ అస్మెలాష్ బెకెలేకు అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందజేశారు. ఈ వేడుకకు మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిర్వహణ బృందంలోని సీనియర్ సభ్యులు హాజరయ్యారు. హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క అత్యంత ప్రభావవంతమైన ఈఎస్జి (పర్యావరణ, సామాజిక & పాలన) కార్యక్రమాలలో ఒకటి. ప్రస్తుతం, ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 119 ప్రదేశాలలో ప్రతిరోజూ 115,000 కంటే ఎక్కువ భోజనాలను అందిస్తుంది. జాంబియాలో ఈ కార్యక్రమం విజయవంతం కావడంను అనుసరించి, ఇథియోపియాలో దీని విస్తరణ జరిగింది. మే 2024 నుండి మూడు పాఠశాలల్లో 900,000 కంటే ఎక్కువ భోజనాలు వడ్డించబడ్డాయి.“హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది మలబార్ గ్రూప్ చేపట్టిన అత్యంత అర్థవంతమైన ఈఎస్జి కార్యక్రమాలలో ఒకటి. బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపారిగా, తాము సేవలందించే సమాజాల పట్ల మా నిబద్ధత వ్యాపారానికి మించి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సానుకూలంగా ప్రభావితమైన లక్షలాది జీవితాలు స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధి అనే మా లక్ష్యంకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇథియోపియన్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా, 2026 చివరి నాటికి 10,000 మంది పిల్లలకు రోజువారీ భోజనం అందించడంతో పాటు విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా రాబోయే రెండేళ్లలో యుఎస్ 864,000 డాలర్ ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నాము” అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ తెలిపారు."మా కార్యకలాపాల ప్రారంభం నుండి కమ్యూనిటీ అభ్యున్నతి అనేది మా బ్రాండ్ డిఎన్ఏలో అంతర్భాగంగా ఉంది. హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం ద్వారా, రోజువారీ పోషకాహారం పొందడం వల్ల వ్యక్తిగత జీవితాలు మాత్రమే కాకుండా మొత్తం సమాజాలు ఎలా మారతాయో మేము చూశాము. ఈ కార్యక్రమాన్ని ఇథియోపియాకు విస్తరించడం అనేది ఆకలిని నిర్మూలించడం మరియు ప్రపంచవ్యాప్తంగా విద్యా సమానత్వాన్ని పెంపొందించడం అనే మా లక్ష్యం దిశగా మరొక ముందడుగు. అత్యంత అవసరమైన పిల్లలు మరియు కుటుంబాల జీవితాల్లో కొలవగల, శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కె.పి వ్యాఖ్యానించారు.
