
నర్సంపేట, మన ధ్యాస: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో బీసీ నాయకులు పిట్టల రమేష్ ముదిరాజ్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల మల్లయ్య ముదిరాజ్ దశదిన కర్మ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించగా ఆయనతో పాటు బీసీ సంఘం నాయకులు పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, నల్లబెల్లి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పాండవుల రాంబాబు ముదిరాజ్, డ్యాగల శ్యామ్ ప్రసాద్, డ్యాగల రాము, ముదిరాజ్ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్, తేలు రాంచందర్, ఆకుల శ్రీనివాస్, కొక్కు యాదగిరి, ఆకుల దామోదర్, పిట్టల రామస్వామి, గోనెల నరహరి, ముత్యాల కమల్, మొద్దు శేఖర్, దుగ్గొండి మండల నాయకులు పాండవుల వెంకటేశ్వర్లు, కీసరి మొగిలి, కీసరి స్వామి, రవి, కట్టమల్లు తదితరులు పాల్గొన్నారు.
