
తిరుపతి, మన ధ్యాస,నవంబర్ 16 : కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర నేత తోట వాసుదేవ్ రాయల్ ఆదివారం నెల్లూరు లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ తోట వాసుదేవ్ రాయల్ ను అభినందించి శాలువతో ఘనంగా సత్కరించి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారందరికీ రుణాలతో పాటు కాపులు ఆర్థికంగా ఎదిగేలా సాయపడాలని మంత్రి వాసుదేవ్ రాయల్ కు సూచించారు.