
తిరుపతి, మన ధ్యాస, నవంబర్ 16 : రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోకల జనార్ధన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ సీనియర్ నేత పోకల జనార్ధన్ తనకు దేవాదాయ శాఖ పరిధిలోని నామినేటెడ్ పదవులలో తనకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు.