
కనిగిరి నవంబర్ 15 మన ధ్యాస న్యూస్,, ప్రతినిధి ://
కనిగిరి నియోజకవర్గం పామూరు మండల కేంద్రమైన పామూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శాశ్విత అన్నదానం కార్యక్రమంలో భాగంగా కనిగిరి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, గోవింద స్వాములు, శివ స్వాములు, మాలలు ధరించిన స్వాములు అన్నదానానికి విచ్చేయవలసిందిగా దేవస్థానం కమిటీ సభ్యులు గుత్తి రాజా , బైరెడ్డి జయరామి రెడ్డి, కావిటి సుబ్బయ్య, ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దారపనేని చంద్రశేఖర్ తన వంతు దేవస్థానము కు ఎంతో సహాయ సహకారాలు అందజేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.