
కలిగిరి నవంబర్ 14 మన ద్యాస న్యూస్://
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. క్రాకుటూరు, గుడ్లదోన, గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్ముతూ నిల్వ ఉంచిన 39 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులనీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ జలీల్ తెలిపారు .ఈ దాడుల్లో ఎస్సై శ్రీను పాల్గొన్నారు.