
నెల్లూరు, నవంబర్ 13 మన ధ్యాస న్యూస్://

పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేడు డా బీఆర్ అంబేద్కర్ భవనం నందు విలేకరులు సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగినది. నవంబర్ 17 న ఛలో డిల్లీ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ,ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగలు పోల్గొని వారు మాట్లాడుతూ సీజె ఐ గవాయ్ పై అక్టోబర్ 6 న బూటుతో దాడి చేయడం హేయమైన చర్య అని ఈ దాడిని దేశంలో ఉన్న దళిత నేతలందరు ముక్త కంఠంతో ఖండించారని అయితే అయినా ఇప్పుడు వరకు దాడి చేసిన రాకేష్ కిశోర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు మండిపడ్డారు ఈ దేశంలో దళితుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం అవుతుందని పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో డిల్లీ గడ్డపై అడుపెట్టే లోపల రాకేష్ కిశోర్ ని అరెస్ట్ చేయాలని లేదంటే దళితుల సత్తాఏమిటో చూపిస్తామని హెచ్చరించారు అదేవిదంగా ఎంఈఎఫ్ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగ, వేగూరు వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ మహిళా ఇన్చార్జీ జానకి మాల మాట్లాడుతూ ఈ దాడి జరిగి నెల రోజులు అవుతున్న నిందితుడి పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని కేవలం దళితుల కాబట్టే దాడి చేశారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే జిల్లాలో ఉన్న ప్రతీ దళితుడు నవంబర్ 17 డిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్లూరి శేషయ్య మాదిగ,దర్శిగుంట శ్రీనివాస్ మాదిగ,వన్నం క్రిష్ణయ్య మాదిగ,సిద్దరపు పెంచలయ్య మాదిగ,ఏసుపోగు జయరాజు మాదిగ,కలివేటి మునియ్య మాదిగ.కొండిపాక వెంకటేష్ మాదిగ,మొండెం లక్ష్మయ్య మాదిగ,పాజర్ల రమణయ్య,మల్లాపు వేడుకొండలు,బక్కా శంకర్ మాదిగ,కుంచం శివ మాదిగ,బి సుధాకర్ మాదిగ,ఎన్ రమేష్,బి వెంకట్,బి రమణయ్య, వి రఘురామ్ మాదిగలు తదితరులు అధికసంఖ్యలో పోల్గొన్నారు.