
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద,భాన్స్ వాడ డిప్యూటీ డిఎంఎచ్ ఓ గా నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బుధవారం నిజాంసాగర్ సూపర్ వైజర్ లు,ఏఎన్ఎం,లు డాక్టర్ రోహిత్ కుమార్ నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం డాక్టర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ..సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని,తమకు కేటాయించిన ఆరోగ్య లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మన ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు.