
కలిగిరి, నవంబర్ 12 మన ధ్యాస న్యూస్ :///

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్లసురేష్ ఆధ్వర్యంలో బొమ్మరాజుచెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు,సి ఎమ్ ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు పాల్గొని పెద్దపాడు గ్రామస్తులు కు చావా రమణమ్మ ,బోడిపూడి అనిత ,ఎడ్లరమణమ్మ లకుచెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ,మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఎల్లప్పుడూ భావిస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల వల్ల కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధి ఒక బలమైన అండగా నిలుస్తుందనిఆయన అన్నారు. అలాగే, ప్రభుత్వం అందించే ప్రతి పథకమూ ను నిజంగా అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని,ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఆ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో యూనిట్ ఇంచార్జి మొక్కా హజరత్ రావు, మరియు పెద్దకొండూరు గ్రామ కమిటీ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, డి శివరాం తదితరులు పాల్గొన్నారు.
