
కొండాపురం నవంబర్ 12 మన ధ్యాస న్యూస్ ://
కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారంలో మద్దసాని పిచ్చయ్య ఉత్తర క్రియల కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని, మద్దసాని పిచ్చయ్య గారి చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో ఆ భగవంతుడు వారికి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొని పిచ్చయ్య గారిని స్మరించుకున్నారు.
