
ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..
వింజమూరు నవంబర్ 11 మన ధ్యాస న్యూస్ ://

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సూచనల మేరకు పండుగ వాతావరణం లో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండలం, క్లస్టర్, యూనిట్ కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు నియామక ప్రమాణ స్వీకార మహోత్సవము ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంభం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచల బాబు యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డిలు హాజరయ్యారు. అదేవిధంగా నియోజకవర్గంలోనే 8 మండలాల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకులకు పార్టీలో సమచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ముందుంటుందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని వారే నిజమైన సైనికులని తెలిపారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరు పదవిని అలంకారప్రాయంగా చూడకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నేటి నుండి మూడు రోజులపాటు మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూతు కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పార్టీ సూచించిన నేతలను అఖండ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ రథసారదులుగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలన్నారు. పార్టీ పదవులను పందారం చేయడంతో నాయకుల్లో జోష్ పెరిగింది.

వింజమూరు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, దుత్తలూరుమండల కన్వీనర్ గా ఉండేల గురువారెడ్డి, వరికుంటపాడు మండల కన్వీనర్ గా చండ్ర మధుసూదన్ రావు, సీతారాంపురం కన్వీనర్ గా చింతల శ్రీనివాసులు, కొండాపురం కన్వీనర్ గా పోలినేని చంద్రబాబు నాయుడు, జలదంకి మండల కన్వీనర్ గా మునగాల తిరుమలరెడ్డి ,అలాగే మండల క్లస్టర్ ఇంచార్జీలుగా సీతారాంపురం తోకల రామచంద్ర, ఉదయగిరి షేక్ రియాజ్, దుత్తలూరు, తాళ్లూరి దయానందం, వరికుంటపాడు, పోక మహేష్ , వింజమూరు చేబ్రోలు వసంతరావు, కొండాపురం పోలినేని రమేష్ , కలిగిరి కల్లూరి చంద్రమౌళి, గంజo రాఘవేంద్ర, జలదంకి మందపల్లిమాల్యాద్రి, పూనూరు భాస్కర్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్చార్జీలుగా పేరం సుధాకర్ రెడ్డి, మారెళ్ళ మల్లికార్జున, పాములపాటి మాల్యాద్రి, అంబటి శంకరయ్య, నోటి మల్లికార్జున, దివి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శిలుగా, ముత్తూరు సుమన్ బాబు, పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్, బద్దిపూడి మాచర్ల, జాజుల శివరామయ్య, చల్లా శ్రీనివాసులు యాదవ్, కందుకూరి వెంకటేశ్వర్లు, వీరితోపాటు మండల పార్టీ ఆర్గనైసింగ్ సెక్రెటరీలు, సెక్రటరీలు, కోశాధికారులు, మరియు యూనిట్ ఇన్చార్జిలుగా మరో 95 మంది చేత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
