మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దరం జరుగుతుందని టూరిజంశాఖ మంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గల ప్రసిద్ధిగాంచిన,పురాతనమైన కౌలాస్ కోటను ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో కలిసి పరిశీలించారు.వందలాది నిచ్చేనాలు ఎక్కుతూ, బండరాళ్లు,చెట్ల పొదల మధ్యల నుండి ముందుకు సాగుతూ కోట ఖండాలను,పురాతన శిల్పాలు,గత వైభవలను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. కోట బురుజు పై ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద 9గజాల ఫిరంగి పరిశీలించటం జరిగింది. గతంలో దాని ఉపయోగించిన తిరును కౌలాస్ కోట వంశీయులు అనూప్ కుమార్ మంత్రికి వివరించారు. ప్రాచీన కళాఖండాలు,ప్రాచీన కట్టడాలు ప్రాచీన వైభవాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,తెలంగాణ ప్రభుత్వం దానికి ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి కౌలస్ కోటను పర్యాటక స్థలంగా తీర్చదిద్దటం జరుగుతుందని,కోట ముందు ఉన్న కౌలాస్ నాల పై వంతెన నిర్మించి కౌలాస్ నాల ప్రాజెక్టును కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,డీఎఫ్ఓ నిఖిత,ఆయా శాఖల ఉన్నతాధికారులు,కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,కౌలాస్ గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.