
మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,నవంబర్ 9: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, కోడూరుపాడు గిరిజన కాలనీ నందు సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం అందించేందుకు, ఆరోగ్య గుర్తింపు కార్డులను అందజేసిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు కోడూరు కమలాకర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అన్ని గిరిజన కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని ఆరోగ్య గుర్తింపు కార్డులను అందజేస్తున్నాము, ప్రతి గిరిజన కుటుంబం కూడా ఈ కార్డులను తీసుకుని, ఉచిత వైద్యం పొందేందుకు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సింహపురి వైద్య సేవా సమితికి నా ప్రత్యేక ధన్యవాదాలు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు.పై కార్యక్రమంలో ఏ.ఎం.సీ. చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, జై భారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురు ప్రసాద్, శ్రీనివాసులు, టిడిపి కో క్లస్టర్ ఇంచార్జ్ తంబి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
