
ముఖ్య అతిథులుగా పాల్గొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్..!
జలదంకి నవంబర్ 7 మన ధ్యాస న్యూస్ :-జలదంకి మండలం సోమవరప్పాడు గ్రామంలో విశేష భక్తిశ్రద్ధల మధ్య చేవూరి జనార్దన్ రెడ్డి - సులోచనమ్మ దంపతుల చేతుల మీదగా నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సోమనాథ స్వామి మరియు శ్రీ సాయిబాబా నూతన ఆలయ మహా ప్రతిష్ట మహోత్సవం ప్రముఖ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేద ఘోషలతో ఘనంగా నిర్వహించబడింది.ఈ పవిత్ర సందర్భానికి పురస్కరించుకుని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఈ దైవ కార్యములో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవాలయం నిర్మాణం గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు, దాతలు సమిష్టిగా కృషి చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
