
విలేకరులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పెండ్లి పిలుపుమన ధ్యాస , బాపట్ల, నవంబర్ 6:బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ తన కుమారుని వివాహానికి విలేకరులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బాపట్ల సూర్యలంక బీచ్ రోడ్‌లోని రామనగర్ వద్ద కోమలి రిసార్ట్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ...... “నా కుమారుని వివాహం నవంబర్ 8న జరగనుంది. అదే నెల 16న రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది. మీరు అందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.పెళ్లి వివరాలు వెల్లడించిన అనంతరం విలేకరులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఆయన, అందరికీ విందు ఏర్పాటు చేశారు. స్థానిక పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కుటుంబసభ్యులు, సన్నిహితులు, పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే వెంట ఉన్నారు. సంతోషభరిత వాతావరణంలో సాగిన ఈ సమావేశం పత్రికా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

