
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి,ఎంపీవో అనిత రెడ్డి,హౌసింగ్ ఏఈ సమీనా లు కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు తమ ఇళ్లను సమయానికి నిర్మించుకోవాలి.ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన వారు వేగంగా పనులు పూర్తి చేయాలి అని సూచించారు. అలాగే గ్రామంలోని ఇతర అభివృద్ధి పనులను కూడా పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రామకృష్ణ,ప్రేమ్ సింగ్, రమ్యశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు,తదితరులు ఉన్నారు.