
ఎస్ఆర్ పురం నవంబర్ 5 మన ద్యాస
ఎస్ఆర్ పురం మండలంలోని వెంకటాపురం పంచాయతీ నందు క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, చేజింగ్ మాస్టర్, పిట్ నెస్,అయిన విరాట్ కోహ్లీ 37వ జన్మదినం సందర్భంగా వెంకటాపురం పంచాయతీ కింగ్ కోహ్లీ అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోహ్లీ పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు భారీ కేక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోహ్లీ అభిమాని పొన్న మురళి పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఆయనతోపాటు కోహ్లీ అభిమానులు కోటి, పేతురు, గుణ, పింకు, శ్రీధర్, ధనంజయలు కలిసి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు.