తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్
తవణంపల్లి మండలం అరగొండ మేజర్ పంచాయతీ గ్రామ కేంద్రం నందు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బిఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన అరగొండ ఎంపీటీసీ జీ కరీం,సర్పంచ్ టి మల్లు దొరై,మరియు ప్రశాంత్ కుమార్ ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రజ్ఞా పాటవాలతో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మహా మనిషి, గొప్ప మానవతావాది, మహోన్నత మానవతావాది, విద్యావేత్త, మేధావి, తాత్వికుడు, గొప్ప దేశభక్తుడు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రచించిన బహుజనుల మానవతావాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అరగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ టి మల్లి దొరై , పంచాయతీ వార్డు సభ్యులు, అరగొండ గ్రామపంచాయతీ ఈఓ, పైమాఘం ప్రశాంత్ కుమార్ పైమాఘం బాబు తంగరాజ్, నాగేష్ పైమాఘం యూత్ నల్లపరెడ్డి పల్లి వార్డుమెంబెర్ నాగరాజ, హరి, భువనేశ్వర్, ఎస్ అరుణ్, సందీప్,సతీష్,నల్లపరెడ్డిపల్లి యూత్,చారాల చలపతి మురళి , కిషోర్ . మరియు చారాల యూత్ .పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది, అరగొండ, బీసీ కాలనీ, గ్రామాల పెద్దలు మరియు యువకులు భారీగా పాల్గొన్నారు.