
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా నాయకపోడ్ కులదైవం భీమన్న దేవుని ఉత్సవాలు మొహమ్మద్‌నగర్ మండలంలోని కోమలాంచ గ్రామంలో భీమన్న గుడి వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు గోదావరి నది ఉపనదైన మంజీరా నదికి భీమన్న దేవుని గదాలు తీసుకెళ్లి గంగాస్నానం చేయించి,అభిషేకం కోసం నీళ్లు తెచ్చారు.మహిళలు,యువతీ యువకులు,కుల పెద్దలు, కళాబృందాలు తప్పెట్లతో ఆటపాటలతో భాజా భజంత్రీలతో ఊరేగింపుగా భీమన్న దేవాలయానికి చేరుకున్నారు.తరువాత భీమన్న దేవునికి అభిషేకం, అలంకరణ,పూజలు నిర్వహించి,భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ధర్బార్ కార్యక్రమం నిర్వహించారు.గురువారం అమ్మవారికి బోనాలు,ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి అధ్యక్షులు కొమ్ము రవికుమార్,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య,జిల్లా కోశాధికారి సాయిబాబా,శ్రీనివాస్,శంకర్, సాయిలు,బాలురాజు, సంజీవులు,టీ.సాయిలు, కాశీరం,నారాయణ, కుల పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.