

వింజమూరు, నవంబర్ 05 :(మన ధ్యాస న్యూస్):///
వింజమూరు మండలంలోని చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణ: యు టి ఎఫ్ జె వి వి ఆధ్వర్యంలో ఇంజమూరు మండల స్థాయిలో జిల్లా బాలుర ఉన్నత పాఠశాల నందు చెకముఖి టాలెంట్ టెస్ట్ జరిగినది. ఈ టాలెంట్ టెస్ట్ నందు మండలంలోని ఆరు ఆరు హై స్కూల్స్ పాఠశాల స్థాయి విజేతలు పాల్గొన్నారు. అయితే ఈ పోటీలలో మండల ప్రథమ స్థానం జడ్.పి.హెచ్.ఎస్ కాటేపల్లి గెలవగా ద్వితీయ స్థానం జడ్పీహెచ్ఎస్ వింజమూర్ తృతీయ స్థానం జడ్పీహెచ్ఎస్ గుండె మడకల విజేతలగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు రమేషు మధుసూదన్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు మాలకొండయ్య జనవిజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు కామాక్షయ కృష్ణారెడ్డి మరియు యుటిఎఫ్ నాయకులు చెంచల బాబు వెంకటేశ్వర రెడ్డి వీరాంజనేయులు జగన్ బ్రహ్మం ప్రసాదు రవి మీ రావాలి తదితరులు పాల్గొన్నారు.
