
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ — ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి చర్యలు...
వింజమూరు నవంబర్ 4 :(మన ధ్యాస న్యూస్)://
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఎల్లప్పుడూ ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను వినిపించుకునే వేదికగా నిలుస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు, వ్యక్తిగత సమస్యలు, గ్రామ స్థాయిలో ఎదురయ్యే అభివృద్ధి సమస్యలు వంటి వాటిని సీరియస్గా పరిగణించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల మనసుల్లో నిజమైన ప్రజా సేవకుడిగా గుర్తింపు, పొందుతున్నారు.శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా, ప్రజల ఆప్తుడుగా ప్రతి ఒక్కరికి చేరువ అవుతూ “సేవే లక్ష్యం” అనే ధ్యేయంతో కష్టపడుతున్న నాయకుడిగా ఆయన పేరు మారుమ్రోగుతుంది.
