
వరికుంటపాడు, నవంబర్ 3: మన ద్యాస న్యూస్ :////
విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం నుంచే ప్రారంభించడం మెట్ట ప్రాంతం ప్రజలపై ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి ఉన్న ప్రత్యేక అభిమానమే కారణమని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు,అన్నారు.సోమవారం వరికుంటపాడు మండలం లోని రామపురం గ్రామంలో జరిగిన విపిఆర్ నేత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెడ్డి కి పుష్ప గుచ్చం ఇచ్చి సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత తాగనీరు అందించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కే దక్కుతుందన్నారు. జిల్లాలో మరియు ఉదయగిరి ప్రాంతంలో నడవలేని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ఉచితంగా అందజేసి తన దాతృత్వం చాటుకొన్న విపిఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ప్రజలకు సేవ చేయటం లో ముందుండే దంపతులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అని ఆయన అన్నారు.ప్రజా సేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. కంటి వైద్యానికి సంబంధించి అనుభవజ్ఞులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఇంత ఖరీదైన బస్సు ఏర్పాటు చేయటంలోనే వారు ప్రజల పట్ల చూపిస్తున్న దాతృత్వానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. రాజకీయంగా అనేక విమర్శలు చేస్తున్న వాటన్నిటిని లెక్కచేయకుండా ప్రజల శ్రేయస్సు, సేవే ముఖ్యమని ముందుకు సాగుతున్న ఆదర్శ దంపతులు అని పేర్కొన్నారు. ఆపదని దరిచేరితే హక్కున చేర్చుకొని వారి ఆపదను తీర్చే గొప్ప మనసున్న దంపతులని ఆయన కొనియాడారు. ఇలాంటి నాయకులు మనకు ఉండటం హర్షించదగిన విషయం అన్నారు.
