
మన ధ్యాస, కామారెడ్డి: నవంబర్ 2,
బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సలహాదారుడిగా కేబినెట్ హోదాతో నియమితులైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ — సుదర్శన్ రెడ్డి రాష్ట్ర సలహాదారుడిగా నియమితులవడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం.ఆయన అనుభవం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ,అభివృద్ధి పథకాల అమలు మరింత బలపడుతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజద్ ఖాన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.