
సీతారామపురం (నవంబర్ 2): మన ధ్యాస న్యూస్ ://
సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ విపిఎర్ ట్రస్ట్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వినూత్న కార్యక్రమానికి నేడు ఉదయం 9:00 గంటలకు రామాపురం గ్రామం, వరికుంటపాడు మండలంలో శ్రీకారం చేపడుతున్నారని వరికుంటపాడు మండలం టీడీపీ క్రిస్టియన్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ ఓబులాపురం దేవప్రఓన్న ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ…."వి.పి.ఆర్ నేత్ర ద్వారా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ శిబిరం" నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఉదయగిరి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలకు కంటి సంబంధిత సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే ఉద్దేశ్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నేత్ర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి కంటి అద్దములు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మరియు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రజలకు సేవ చేయాలనే తమ సంకల్పాన్ని వ్యక్తం చేయనున్నారు.కావున మన ఉదయగిరి నియోజకవర్గం లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.