
తవణంపల్లి నవంబర్ 1 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం శనివారం పండితులు మంత్రోచ్చారణ మధ్య స్వామి అమ్మవార్ల పటం మేళతాలలతో గ్రామంలో శనివారం స్వామి అమ్మవార్ల ఊరేగింపు,కలశ పూజ,యజ్ఞయాగాలు,తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా వేదపండితులు మాట్లాడుతూ గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు ఈ దైవ కార్యం చేస్తున్నారని కావున గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తమకు తోసిన పూజా సామాగ్రి తీసుకొని రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
