
మన ధ్యాస,బాన్స్ వాడ,
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అజారుద్దీన్‌కు శనివారం హైదరాబాద్ ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాత్ ఖాన్,పాత బాలకృష్ణ,క్రాంతి లు కలసి పుష్పగుచ్చం అందజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — అజారుద్దీన్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని ప్రశంసించారు. మంత్రి పదవి చేపట్టడం ఆయన సేవా భావానికి గుర్తుగా భావిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా ప్రజల అభ్యున్నతి,అభివృద్ధి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో మంత్రి అజారుద్దీన్ మరింత చురుకుగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
