
వింజమూరు, నవంబర్ 01 :(మన ధ్యాస న్యూస్):///
వింజమూరు మండలంలోని చాకలకొండ గ్రామంలో సినార్డ్ స్వచ్చంద సేవ సంస్థ మరియు పి డి ఏ - యు ఎస్ ఏ, వారి యొక్క భాగస్వామ్యం తో సేఫ్ గార్దింగ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డిజాస్టర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమం ప్రారంభించాడమైనది. ఇందులో భాగముగా వాతావరణ మార్పులను అదిగమించేందుకు 50,000 వేల తాటి విత్తనాలు, వేప, మరియు కానుగ విత్తనాలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా వింజమూరు మండలం లోని కొన్ని పాఠశాలలో మొక్కకు నాటే కార్యక్రమం, ఇ సి ఓ విలేజ్ క్రింద ఉండే గ్రామాలలో మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టారు. అదేవిదంగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయుటకు రైతులకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్… సినార్డ్ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ,గ్రామాలలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు సినార్డ్ సంస్థ డైరెక్టర్ జేపీ జవహర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, తెలియచేసారు.ఈ కార్యక్రమం లో చాకలకొండ పంచాయతీ సర్పంచ్ ఉప్పుటూరు కుమారి, స్థానిక ఆర్ ఎంపీ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ కె.శేఖర్ మరియు గ్రామ ప్రజలు, సినార్డ్ సంస్థ అగ్రికల్చర్ ఎక్సపర్ట్, షేక్ ముబీనా, వింజమూరు కమ్యూనిటీ ఆర్గనైజర్ వై.శ్యామల, కె.శశికళ, వై.కేశవ నారాయణ, తడుతరులు పాల్గొన్నారు.
