
ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ పంపిణీ – చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు భరోసా: ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి నవంబర్ 1 :(మన ధ్యాస న్యూస్)://
కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు. ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?” అని ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు ప్రతి నెలా మొదటి తేదీన పింఛన్ సమయానికి అందుతున్నదని తెలిపారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ-ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి అనేక వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించే విధంగా ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ అందించే విధానం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమయానికి, పారదర్శకంగా పింఛన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
