 
    
మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పనుల పురోగతిపై సమీక్షించారు.భవనాల నిర్మాణాలు,రోడ్లు,సంక్షేమ పథకాల అమలు పనులను వేగంగా పూర్తి చేయాలని, అధికాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,ఎఫ్ డీఓ నికిత,తదితరులు ఉన్నారు.