 
    
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. విచారం వ్యక్తం బాధితులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన బొల్లినేని
వింజమూరు, అక్టోబర్ 30 :(మన ధ్యాస న్యూస్):///
కర్నూలు వద్ద ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గోళ్లవారిపల్లె గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యేలైన బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గురువారం గోళ్లవారిపల్లె గ్రామానికి చేరుకున్న బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్, ఆయన తండ్రి గోళ్ల మాలకొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ,ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. కష్టార్జితంతో ఎదిగిన రమేష్ కుటుంబం ఇలాంటి విషాదాన్ని ఎదుర్కోవడం హృదయ విదారకం.” అని అన్నారు.రమేష్ భార్య అనూష, పిల్లలు శశాంత్, మన్విత్ను కోల్పోవడం వంటి విషాదం మరెవరి జీవితంలోకి రాకూడదని ఆకాంక్షించారు. బాధలో ఉన్న మాలకొండయ్య కుమార్తె ధనమ్మ పరిస్థితిని ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి బొల్లినేని వెంకట రామారావు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
